![]() |
![]() |
.webp)
ఫస్ట్ జనరేషన్ యాంకర్స్ లో స్టిల్ కంటిన్యూ అవుతున్న యాంకర్ సుమ కనకాల..ఎన్నో యేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో యాంకర్‌గా పని చేస్తూనే ఉన్నారు. ఆమె మళయాళీ అయినప్పటికీ, తల్లి సూచనల మేరకు తెలుగు నేర్చుకుని అనర్ఘళంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు లైంలైట్ లో ఉన్నారు ఆడియో రీలిజ్ ఈవెంట్స్, మూవీస్ ఫ్రీ రిలీజ్‌ఈవెంట్స్ తో ఆమె ఎప్పుడూ ఫుల్ బిజిగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో మాత్రం ఎక్కగా తగ్గేదేలే అన్నట్టుగా యాక్టివ్‌గా ఉంటారు సుమ.
తన కొడుకు రోషన్ కనకాలను కూడా తెలుగు ఆడియన్స్ కి బబుల్ గం మూవీతో పరిచయం చేశారు సుమ . ఈ మధ్యనే తన కొడుకు నటించిన సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొన్నారు. అలంటి సుమ తన ఫాన్స్ తో ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ని షేర్ చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమె తన తాతయ్య గురించి ఒక పోస్ట్ పెట్టారు. సుమ తాతగారికి 98 యేళ్ల వయసులో ఓ రికార్డును క్రియేట్ చేశారు. తాతయ్య అంటే సుమ అమ్మమ్మ గారి సోదరుడు. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆ తాతయ్య పేరు పి.బాలసుబ్రమణ్యన్ మీనన్ . 73 యేళ్ల నుంచి ఈయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు.
ఈ లాంగ్ కేరీర్ ను పూర్తి చేసుకున్న ఏకైక లాయర్‌గా ఆమె తాతయ్య వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఆయనకు అవార్డును అందజేసింది. యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్ని గర్వంగా సోషల్ మీడియాలోని తన ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. సుమ స్పందిస్తూ... తాతయ్యే తన సూపర్ హీరో అని చెప్పారు. తనతో పాటు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. సుమ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఈ పోస్టుపై నెటిజన్లు కూడా స్పందించారు. మరి ఆ డిఎన్ ఏ అక్కడి నుంచి వచ్చింది. మీరు కూడా త్వరలో ఈ అవార్డు తీసుకుంటారు.ఇన్నేళ్లుగా యాంకరింగ్ లో కొనసాగిన వ్యక్తి ఇంకొకరు లేరు. మరి కొన్నేళ్లపాటు ఇలాగే కొనసాగితే.. గిన్నిస్ రికార్డు సుమని వరించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |